పుస్తెమెట్టెలు స్వర్ణకారులే విక్రయించే ఫైల్‌పైనే మొదటి సంతకం - తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: తెలంగాణ రక్షణ సేన పార్టీని ప్రజలు ఆదరించి అధికారంలోకి తీసుకువస్తే, విశ్వకర్మల జీవితాల్లో వెలుగులు నింపేలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటామని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతితిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విశ్వకర్మల సంక్షేమంపై కీలక హామీలు ఇస్తూ.. తాము అధికారంలోకి రాగానే పుస్తెలు, మెట్టెలు కేవలం స్వర్ణకారులు మాత్రమే తయారు చేసి విక్రయించేలాంటి చట్టబద్ధమైన ఫైల్‌పైనే తన తొలి సంతకం ఉంటుందని ఆమె సంచలన హామీ ఇచ్చారు. విశ్వకర్మల్లోని మను, మయ, త్వష్ట, విశ్వజ్ఞ, శిల్పి అనే...