విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క - గణిత ఉపాధ్యాయుడి నియామకానికి ఆదేశం
ఖమ్మం జిల్లా బ్యూరో / తెలంగాణ అడ్డా: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనం వారి కృష్ణాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, విద్యార్థుల చదువు మరియు భోజన వసతుల గురించి ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదిగి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమంతో పాటు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పాఠశాలలో...