తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: తెలంగాణలో త్వరలో ఖాళీ కాబోతున్న రెండు కీలక పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సంబంధించి నూతన ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ నియోజకవర్గాల స్థానాల గడువు మార్చి 2027తో ముగియనుండటంతో, భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొత్తగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయనున్నారు. 2026 నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు...