వీర్నపల్లిలో కేసీఆర్, సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు బంజారాల పాలాభిషేకం ఎస్టీ రిజర్వేషన్ల పెంపును గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతా కార్యక్రమం
వీర్నపల్లి / తెలంగాణ అడ్డా: వీర్నపల్లి మండల కేంద్రంలో బంజారా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, సంత్ సేవాలాల్ మహారాజ్ చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఎస్టీల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ 2022 సెప్టెంబర్ 30న జారీ చేసిన G.O.Ms.No.33కు నాలుగేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అప్పట్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విద్యాసంస్థల్లో ప్రవేశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్లు పెరిగినట్లు వారు గుర్తుచేశారు. గిరిజనులకు విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం పెరిగింది:ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ గుగులోత్ కళావతి సురేష్ నాయక్...