రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు.. రూ. 2.5 లక్షల లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డ అధికారులు

రంగారెడ్డి బ్యూరో / తెలంగాణ అడ్డా: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్-ట్రెజరీ ఆఫీస్‌లో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు నిర్వహించిన సంచలన ట్రేప్ ఆపరేషన్‌లో సబ్-ట్రెజరీ ఆఫీసర్ మడిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కావలి అనురాధతో పాటు ఒక ప్రైవేట్ వ్యక్తి వడ్డే జంగయ్య అలియాస్ చిన్న ఏసీబీ అధికారులకు చిక్కారు. బాధితుడి నుంచి ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం రూ. 2,50,000 లంచం డిమాండ్ చేయగా, ఇందులో రూ. 1,00,000 ముందస్తు మొత్తాన్ని (part payment) తీసుకుంటూ వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సబ్-ట్రెజరీ ఆఫీసర్ తన వాటాగా రూ. 50,000 నేరుగా తీసుకోగా, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ సూచనల మేరకు...