చెన్నూర్ చెరువు ఘాట్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ ఎ.భాస్కర్.. భద్రతా చర్యలపై అధికారులకు ఆదేశాలు

చెన్నూర్ / తెలంగాణ అడ్డా: చెన్నూర్ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే చెన్నూర్ చెరువు ఘాట్‌ను మంచిర్యాల జోన్ డీసీపీ ఎ.భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్ బన్సీలాల్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విగ్రహాలు వచ్చే మార్గం, బయటకు వెళ్లే మార్గం, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మరియు క్రెన్లను ఏర్పాటు చేసే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. చెన్నూర్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకల వేళ భక్తులకు, నిర్వాహకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గౌరవ మంత్రి శ్రీ వి. వెంకటస్వామి చేతుల...