రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం - సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం - సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల జిల్లా/ తెలంగాణ అడ్డా: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లాలో గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, నమోదైన మరణాలపై ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. గత నెల రోజుల్లో జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 1,072 కేసులు, మోటార్ వెహికల్ యాక్ట్ (MVI Act) కింద 20,449 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాలంలో మొత్తం 30 రోడ్డు...