భక్తిశ్రద్ధలతో శాంతియుతంగా వినాయక నిమజ్జన ఉత్సవాలు నిర్వహించాలి - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ / తెలంగాణ అడ్డా: వేములవాడ పట్టణంలో ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్న వినాయక నిమజ్జన వేడుకలను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడలో మొత్తం 311 గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వినాయక మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు...