హైదరాబాద్‌లో డిసెంబర్ నుంచి హార్వర్డ్ కోర్సులు - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: తెలంగాణను గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ బిజినెస్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో యూకే యూనివర్సిటీలు మరియు బిజినెస్ స్కూళ్ల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఫ్యూచర్ సిటీ, మరియు స్కిల్స్ యూనివర్సిటీల గురించి యూకే బృందానికి అధికారులు వివరించారు. సమావేశంలోని ముఖ్య ముఖ్యాంశాలు: హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ కోర్సు: అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ డిసెంబరు నుంచి హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్ కోర్సును అందించనుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు: ఎంఐటీ...