ఉట్నూర్లో వరుస దొంగతనాలకు చెక్ – ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా బ్యూరో / తెలంగాణ అడ్డా: ఉట్నూర్లో గత 8 నెలలుగా తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్ వివరాలను వెల్లడించారు. చోరీల తీరు: నిందితులు ప్రధానంగా 3 ఇళ్లలో చోరీ చేసి 3 తులాల బంగారం, 47 తులాల వెండి మరియు రూ. 30 వేల నగదును అపహరించారు. కేవలం ఇళ్లే కాకుండా ట్రాన్స్ఫార్మర్ల రాగి తీగలు, కాపర్ కాయిల్స్ మరియు సోలార్ పరికరాలను కూడా చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 6 దొంగతనాల కేసుల్లో మోనూ,...