రవాణా రంగ కార్మికుల పిల్లలకు మెరిట్ స్కాలర్‌షిప్‌ల అందజేత - మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను విద్యలో ప్రోత్సహించేందుకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ సీఎస్‌ఆర్ (CSR) కింద మెరిట్ స్కాలర్‌షిప్‌లు అందించడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్కాలర్‌షిప్ పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు. "యువ మేధస్సుకు ప్రోత్సాహం - ఉజ్వల భవిష్యత్తుకు బాట" అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 750 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో...