కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో రెవెన్యూ అధికారుల విచారణ.. 320 ఎకరాల అసైన్డ్ భూమిపై సర్వే కలకలం
తెలంగాణ బ్యూరో / తెలంగాణ అడ్డా: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములకు సంబంధించి రెవెన్యూ అధికారుల విచారణ తీవ్రతరం అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు హుటాహుటిన ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజుపూర్ గ్రామాల్లోని 3 గ్రామాల సరిహద్దుల్లో ఉన్న అసైన్డ్ భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా 325 సర్వే నంబర్లోని అసైన్డ్ భూములపై దృష్టి సారించి, ఆ భూముల కబ్జాలో ఎవరెవరు ఉన్నారనే దానిపై సమగ్ర వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ రెవెన్యూ గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో పరిశీలన పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సర్వే...