వేలాల గ్రామంలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు - భారీగా వాహనాల స్వాధీనం
రామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా: పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేలాల గ్రామంలో జైపూర్ ఎస్ఐ భూమేష్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 62 మోటార్ సైకిళ్లు, 5 ఆటోలు, 1 కారు మరియు 1 ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తుపదార్థాల వినియోగం, నిల్వ, సరఫరా, అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా లేదా...