దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేసిన తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు, బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది. ఈ మేరకు గతంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మరియు తీర్పును హైకోర్టు కొట్టివేసింది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ మారకుండా, వేరే పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడం ఫిరాయింపు చట్టం కిందకు వస్తుందని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు...