జగిత్యాల కృష్ణానగర్ & శివవీధి ఆల్ఫోర్స్ పాఠశాలలో 108 నైవేద్యాలతో గణనాథునికి ఘనంగా పూజలు
జగిత్యాల / తెలంగాణ అడ్డా: జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ మరియు శివవీధిలో గల ఆల్ఫోర్స్ పాఠశాలల్లో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి 108 రకాల నైవేద్యాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ వేడుకల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి గారు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మిక విలువల పట్ల అవగాహన పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాలల ప్రాంగణాలు భక్తి వాతావరణంతో కళకళలాడగా,...