కుల వివక్ష నిర్మూలన, బీసీ జనాభా లెక్కింపుపై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు - "పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్" సదస్సు

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్, సకల జన సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’’ సదస్సులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రసంగించారు. దేశంలో కుల వివక్ష రూపుమాపాలని, బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. సదస్సులో కవిత ప్రస్తావించిన ప్రధానాంశాలు: కుల వివక్ష - సామాజిక వాస్తవాలు: దేశంలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారైనా, రాష్ట్రపతి లేదా స్పీకర్ వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్నవారైనా కుల వివక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని కవిత పేర్కొన్నారు. మనకు తెలియకుండానే లక్షలాది మంది రోజువారీ జీవితంలో ఈ...