పంట పొలాలకు డ్రైనేజీ మళ్లింపు.. రైతుల ఆవేదన
పంట పొలాలకు డ్రైనేజీ మళ్లింపు.. రైతుల ఆవేదన ఆర్‌అండ్‌ఆర్ కాలనీ మోరీలను పంట పొలాల వైపు మళ్లించారని ఆరోపణ సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతుల విజ్ఞప్తి బోయిన్పల్లి, సెప్టెంబర్ 18 (తెలంగాణ అడ్డా): వరద వెళ్లి గ్రామ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ రాజన్నపేట డ్రైనేజీ నీటిని పంట పొలాల వైపు మళ్లించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ స్వయంగా డ్రైనేజీని పంట పొలాల వైపు మళ్లించారని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల వివరాల ప్రకారం.. ఆర్‌అండ్‌ఆర్ కాలనీ చుట్టూ నిర్మించాల్సిన లింక్ మోరీ పనులు గతంలో పూర్తికాకపోవడంతో సమస్య కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం కాలనీ నుంచి...