వెంకట్రావుపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు గ్రామస్తుల భద్రత, నేరాల నియంత్రణే లక్ష్యం

వెంకట్రావుపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు గ్రామస్తుల భద్రత, నేరాల నియంత్రణే లక్ష్యం బోయినపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డా): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో గ్రామస్తుల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శనివారం ప్రారంభించారు. గ్రామంలోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులు, సమస్యాత్మక ప్రాంతాలను కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్యా మహేందర్, వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, బోయినపల్లి ఎస్సై రమాకాంత్ మాట్లాడుతూ గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంలో, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు. 24 గంటల పాటు నిఘా...