అర్హులైన ప్రతి ఓటరు ఓటు హక్కు పొందేలా కృషి చేయాలి: ఆర్డీఓ కె.ఎస్‌.బి. కుమారి

‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి వేములవాడ, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డా): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సంపూర్ణంగా విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వేములవాడ ఆర్డీఓ కె.ఎస్‌.బి. కుమారి కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా సహకరించాలని ఆమె సూచించారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష నేతల సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ, ఎన్నికల సంఘం ప్రకటించిన SIR ప్రక్రియ షెడ్యూల్‌ను ప్రతి ఓటరు పరిశీలించి, తమకు కేటాయించిన తేదీ, సమయంలో పోలింగ్ కేంద్రంలో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించారు. నోటీసులో పేర్కొన్న విధంగా...