ఉపాధి హామీ పనులపై సమీక్ష జూమ్ సమావేశంలో అధికారులకు కీలక సూచనలు

వీర్నపల్లి, సెప్టెంబర్ 19 (తెలంగాణ అడ్డా): ఉపాధి హామీ పథకం పనులను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, నాణ్యతతో నిర్వహించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని CRD కార్యాలయం నుంచి వీర్నపల్లి మండలానికి చెందిన DRDO, అదనపు DRDO, MPDO, VBGRAMG సిబ్బందితో జూమ్ సమావేశం నిర్వహించి ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష చేపట్టారు. కూలీల వివరాలు, మ్యాపింగ్‌పై సమీక్ష: సమావేశంలో కూలీలకు సంబంధించిన లేబర్ రిపోర్టును పరిశీలించారు. నైపుణ్యం కలిగిన, పాక్షిక నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కూలీల వివరాలను సక్రమంగా మ్యాపింగ్ చేసే విధానంపై అధికారులకు అవగాహన కల్పించారు. నూతన NMMS వెర్షన్‌పై మార్గదర్శకాలు: నూతన NMMS వెర్షన్ వినియోగం, అమలు...