విలీన గ్రామాల ప్రజలకు ఉపాధి హామీ పనులు కల్పించాలి

రోజువారీ వేతనం రూ.600 చెల్లించాలి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ వేములవాడ తెలంగాణ అడ్డా సెప్టెంబర్20: వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల ప్రజలకు, నిరుద్యోగ యువతకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం డిమాండ్ చేసింది. రోజువారీ వేతనంగా రూ.600 చెల్లించాలని కోరింది. వేములవాడ మున్సిపాలిటీలో విలీనమైన నాంపల్లి గ్రామంలోని దళితవాడను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సందర్శించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. తిప్పాపూర్, నాంపల్లి, అయ్యర్‌పల్లి, శాత్రాజుపల్లి, కోనాయిపల్లి తదితర గ్రామాలు సుమారు ఆరు సంవత్సరాల క్రితం మున్సిపాలిటీలో విలీనమైనప్పటి...