మహిళా సంఘాల అధ్యక్షులు మరియు వివో లతో సమావేశం గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేశ్ ఆధ్వర్యంలో సమావేశం
తెలంగాణ అడ్డా ప్రతినిధి బోయిన్పల్లి: గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేశ్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రుణాలపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాల ద్వారా గ్రామపంచాయతీలో సోలార్ ఏర్పాటు చేసేందుకు రూ.10 లక్షల రుణం పొందే అంశంపై చర్చించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత విడతలో విడుదల చేసిన రుణమాఫీకి సంబంధించిన వివరాలను ప్రతి సంఘం సభ్యులకు తెలియజేశారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు వారానికి రెండుసార్లు...