తురక కాశ ముస్లింలకు జనరేటర్ స్కీమ్ అమలు చేయాలి... తురక కాశ సంక్షేమ సంఘం డిమాండ్

తెలంగాణ అడ్డా న్యూస్ /అశ్వాపురం ప్రతినిధి.. తురక కాశ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సయ్యద్. బాద్ షా* గారి ఆదేశాల మేరకు, పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలంలో తురక కాశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అశ్వాపురం మండల అధ్యక్షులు షేక్ ఖలీల్ మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీలలో తురక కాశలు ఒక ప్రత్యేక వృత్తి సమాజంగా ఉన్నారని, తురక కాశ కార్మికుల జీవనోపాధికి ఉపయోగపడే రాళ్లు కట్ చేసే మిషన్ జనరేటర్ స్కీమ్ను ప్రభుత్వం అమలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకం సాధారణంగా అన్ని ముస్లిం మైనారిటీలకు కాకుండా, తురక కాశ ముస్లింలకు మాత్రమే వర్తించే...