లడ్డూ వేలంలో విజేతగా కట్టం నరేష్ ₹32,100లకు విజయ విఘ్నేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కైవసం

మహా అన్నదానంలో వెయ్యి మందికి పైగా భక్తులు డాన్సులు, కేరింతల మధ్య ఘనంగా గణనాథుని నిమజ్జనం తెలంగాణ అడ్డా న్యూస్, భద్రాద్రి జిల్లా ప్రతినిధి: మణుగూరు మండలం సుందరయ్యనగర్‌ కుంకుడు చెట్ల గుంపు గ్రామంలో గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవ కమిటీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విజయ విఘ్నేశ్వర స్వామి లడ్డూ వేలంపాటలో కుంకుడు చెట్ల గుంపు గ్రామానికి చెందిన కట్టం నరేష్ రూ.32,100లకు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. లడ్డూ వేలంలో విజేతగా నిలవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు....