రమ్య రాములమ్మపై చట్టం వర్తించదా? హిందూ-ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా వీడియోలు చేస్తున్నా చర్యలు లేవేం?
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ యంత్రాంగం ఒకవైపు రౌడీషీటర్లను, అసాంఘిక శక్తులను ముందస్తుగా బైండ్ ఓవర్ చేస్తూ కఠినంగా వ్యవహరిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూట్ మ్యాప్లు సిద్ధం చేస్తూ నిరంతరం శ్రమిస్తోంది. అయితే, మరోవైపు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించే వారిపై మాత్రం చట్టం నిశ్శబ్దంగా ఉండటం పట్ల తీవ్రమైన ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రమ్య రాములమ్మ వివాదాస్పద శైలి - పోలీసుల మౌనం వెనుక మర్మమేంటి? మతపరమైన రెచ్చగొట్టే ధోరణి: హిందువులు, ముస్లింలు అంటూ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా, ప్రజల సున్నిత భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో వీడియోలు చేయడం...