మానకొండూర్ మండలంలో గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష, చెరువు కట్ట పరిశీలన

మానకొండూర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: మానకొండూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జనం సజావుగా, భద్రంగా జరగాలనే లక్ష్యంతో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక చెరువు కట్టను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ స్వయంగా పరిశీలించారు. ఈ సమావేశంలో మండల అధికారులు, పోలీసు అధికారులు, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. నిమజ్జన స్థలం వద్ద భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా, తాత్కాలిక లైటింగ్, తాగునీరు, వైద్య సౌకర్యాలు, అగ్నిమాపక వాహనాల సిద్ధత వంటి అంశాలపై వివరంగా చర్చించారు. పెద్ద విగ్రహాలను క్రేన్ల సాయంతో నిమజ్జనం చేయడం,...