కురుమ యాదవ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేత
కురుమ యాదవ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్ పత్రాలు అందజేత బోయినిపల్లి తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 21: బోయినిపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలోని హమ్లెట్ గ్రామమైన రేగులపల్లిలో కురుమ యాదవ సంఘం కమ్యూనిటీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కాగా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రొసీడింగ్ పత్రాల కాపీలను సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా రేగులపల్లి కురుమ యాదవ సంఘం సభ్యులతో ఎమ్మెల్యే మాట్లాడి భవన నిర్మాణానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.4.30 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంజూరైన నిధులతో నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి సంఘం సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. భవన...