తెలంగాణ మలిదశ ఉద్యమకారుల కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: తెలంగాణ మలిదశ ఉద్యమంలో అంకితభావంతో సేవలందించిన దివంగత లింగాల కేదారి, ఆయన భార్య దివంగత పుష్పలత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉద్యమ సేవలు - ఆదర్శ జీవితం: తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేదారి దంపతులు అందించిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సాధారణ హోటల్ నడుపుతూ, అన్నం వృథా చేయకూడదని అవగాహన కల్పిస్తూ సమాజం పట్ల బాధ్యతగా నడుచుకున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో వీరు ఉచితంగా భోజనం, టిఫిన్లు, టీలు అందించారని కొనియాడారు. విషాద...