మాదాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమార్చన
తెలంగాణ అడ్డా గన్నేరువరం సెప్టెంబర్ 21 గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో గణనాథుడికి ఘనంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో గణపతికి కుంకుమార్చన చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో యువత, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.