డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి సాగునీటి ప్రాజెక్టుల పునరావాసంపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం, అటవీ సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. సమీక్షా ముఖ్యాంశాలు: ప్రాజెక్టుల నిర్వాసితుల పునరావాస - పునర్వ్యవస్థీకరణ పనులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్లో ఉన్న భూసేకరణ కేసుల ప్రస్తుత స్థితిని జిల్లాల వారీగా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల వారీగా సేకరించాల్సిన భూమి, పూర్తయిన భూసేకరణ వివరాలపై విస్తృతంగా చర్చించారు. కలెక్టర్లకు నిర్దేశం: భూసేకరణతో పాటు పునరావాస...