పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు – రాయదుర్గంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: హైదరాబాద్‌ మహానగరంలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కం చెరువు సమీపంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆత్మగౌరవ చిరునామా: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాలకు సాధ్యమైనంత దగ్గరలోనే సొంతింటిని అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. పేదలను నగరానికి దూరంగా...