రామగుండం పోలీస్ కమిషనరేట్లో ప్రజావాణి – అర్జీల స్వీకరణ
రామగుండం / తెలంగాణ అడ్డా: రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే (ప్రజావాణి) కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఫిర్యాదుదారుతో ఆయన స్వయంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతిపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, చట్టపరంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి వినతులు: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అందజేశారు. భయాందోళనలు వీడాలి: ప్రజలు ఎలాంటి...