పవిత్ర పండుగలను రాజకీయం చేయడం తగదు: బీజేపీపై డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపాటు
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో బీజేపీ పార్టీ చీప్ రాజకీయాలకు తెరలేపడం సిగ్గుచేటని డీసీసీ అధికార ప్రతినిధి అనంతుల రమేష్ మండిపడ్డారు. సోమవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ధికే రాద్ధాంతం: గత కొన్నేళ్లుగా కరీంనగర్ పట్టణంలో వినాయక నిమజ్జన ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయని, తాజాగా నిమజ్జనానికి నీళ్లు వదలడం లేదంటూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకున్న బీజేపీ పండుగ ఏర్పాట్లపై బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. నీటి విడుదలపై వాస్తవాలు: గణేష్ నవరాత్రి ఉత్సవాలు,...