బీసీ సంక్షేమ శాఖపై ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, విద్యా కార్యక్రమాలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న 'ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు' పథకం అమలు, అప్లికేషన్ ప్రక్రియ, అలాగే బీసీ గురుకులాలు, హాస్టళ్ల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు: ఈ పథకం కింద ఇప్పటివరకు 4 లక్షల 6 వేల దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనున్నందున, అర్హులైన ప్రతి బీసీ మహిళకు పథకం ప్రయోజనం...