వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 30 రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, పనుల్లో జాప్యం జరుగుతుండటంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజుల్లోగా 24 గంటలూ నిరంతరం పనులు కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు ఇతర ఆసుపత్రుల నిర్మాణాలపై ముఖ్యమంత్రి గారు ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడంపై ఈ సందర్భంగా...