నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడి.. రూ. 15,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి

నిజామాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో రూ. 15,000 లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. మున్సిపల్ కార్యాలయంలోని రెండో అంతస్తులోగల ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంలో విధులు నిర్వహించే జూనియర్ అసిస్టెంట్ అశోక్ కుమార్ ఈ అవినీతికి పాల్పడ్డారు. సంఘటన వివరాలు: నిజామాబాద్ టౌన్‌లోని రాధా రాజేంద్ర చౌరస్తా సమీపంలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన పద్మశాలి సంఘం వద్ద నెలవారీ పెన్షన్ మంజూరు కోసం, అలాగే ఫిర్యాదుదారు తల్లి సర్వీస్ గ్రూపులో ఇంక్రిమెంట్ ప్రాసెసింగ్ తయారు చేసి అవసరమైన ఎంట్రీలు మరియు ఇతర వివరాలను నమోదు చేసే అధికారిక సహాయం అందించేందుకు జూనియర్ అసిస్టెంట్...