రత్నంపేట గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం సందర్శన
రత్నంపేట గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేష్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం సందర్శన బోయిన్పల్లి తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 22: రత్నంపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ కౌడగాని వెంకటేష్‌తో పాటు ప్రజాప్రతినిధులు సందర్శించి కేంద్రంలో చిన్నారులు, గర్భిణీలకు అందుతున్న సేవలను పరిశీలించారు. కేంద్రంలో ఫ్యాన్లు, విద్యుత్, బల్బుల సదుపాయాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో బాత్రూం సౌకర్యం లేకపోవడంతో ఐసీడీఎస్ సూపర్వైజర్తో మాట్లాడగా, ప్రొసీడింగ్ అందిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పాలు, గుడ్లు, పోషకాహారాన్ని షెడ్యూల్ ప్రకారం అందించాలని, పిల్లల ఎత్తు, బరువును క్రమం తప్పకుండా నమోదు చేసి వారి ఎదుగుదలను పర్యవేక్షించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు పోషకాహారం...