జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలోఅంగన్వాడీ కేంద్రం సందర్శన
జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలోఅంగన్వాడీ కేంద్రం సందర్శన బోయిన్పల్లి తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 22: జగ్రావుపల్లి గ్రామ సర్పంచ్ సుద్దాల మధు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి, కేంద్రంలో చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఫ్యాన్లు, బల్బులు తదితరాలను పరిశీలించారు. చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పాలు, గుడ్లు, పోషకాహారాన్ని షెడ్యూల్ ప్రకారం అందించాలని సూచించారు. పిల్లల ఎత్తు, బరువును క్రమం తప్పకుండా నమోదు చేస్తూ వారి ఎదుగుదలను పర్యవేక్షించాలని కోరారు. గర్భిణీ స్త్రీలకు పోషకాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రం సేవలను సమర్థవంతంగా అందించాలని సూచించారు. పిల్లల...