గణేష్ నిమజ్జనానికి నీటి విడుదల చేయకపోవడం దురదృష్టకరం హిందువుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానిది చిన్నచూపు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా సౌకర్యాలు ಕల్పించాల్సింది పోయి, నిమజ్జనాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్‌లో మంగళవారం ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలోని ముఖ్యాంశాలు: నగరపాలక సంస్థ పరిధిలో జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. చింతకుంట కెనాల్ కాలువకు ఎస్సారెస్పీ నుండి నీరు విడుదల చేయాలని మేయర్, డిప్యూటీ మేయర్‌లుగా తాము...