కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో భారీ మోసం. పెట్టుబడి పేరుతో టోకరా వేసిన ముగ్గురు నిందితుల అరెస్ట్
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా: కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తక్కువ సమయంలో పెట్టుబడి రెట్టింపు, మూడింతలు చేస్తామని నమ్మించి ప్రజల నుంచి భారీగా డబ్బులు సేకరించిన భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. ష్రేయా ఇన్ఫ్రా అండ్ మార్కెటింగ్ పేరుతో మోసాలు: 'Shreya Infra and Marketing Pvt. Ltd.' పేరుతో పెట్టుబడి పథకాలను నిర్వహించినట్లు పోలీసులు తేల్చారు. విస్తృత నెట్వర్క్: కరీంనగర్‌తో పాటు తెలంగాణ, ఏపీ మరియు ఇతర రాష్ట్రాల్లో ఏజెంట్ల ద్వారా ఈ పెట్టుబడులను సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. నిలిచిపోయిన చెల్లింపులు: మే 2024 నుంచి చెల్లింపులు నిలిపివేసి, పెట్టుబడిదారులను మోసం చేసినట్లు...