ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మృతి మానవ తప్పిదమే.. బాధితులను పరామర్శించకుండా మంత్రి ఫోటోలకు పోజులిచ్చారు: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ ఇంక్యుబేటర్‌లో ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందడం పూర్తిగా మానవ తప్పిదమేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం నుంచి కనీస సాయం అందకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. సమావేశంలోని ముఖ్యాంశాలు మానవ తప్పిదమే కారణం: ఆదిలాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంక్యుబేటర్ లో ప్రమాదం జరిగితే తల్లిదండ్రులే తమ పిల్లలను కాపాడుకునే ప్రయత్నం చేసినా, దురదృష్టవశాత్తు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, ఏసీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే...