రామగుండం కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా
రామగుండం బ్యూరో / తెలంగాణ అడ్డా: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. భద్రతా సిబ్బంది వివరాలు: పెద్దపల్లి జోన్: ఏసీపీలు-04, సీఐ/ఆర్ఐలు-15, ఎస్ఐ/ఆర్ఎస్ఐలు-25, ఏఎస్సై/హెడ్ కానిస్టేబుళ్లు-26, పోలీస్ కానిస్టేబుళ్లు-81, మహిళా కానిస్టేబుళ్లు-14, హోంగార్డ్స్-30, ఏఆర్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది-25 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జోన్: ఏసీపీలు-03, సీఐ/ఆర్ఐలు-11, ఎస్ఐ/ఆర్ఎస్ఐలు-26, ఏఎస్సై/హెడ్ కానిస్టేబుళ్లు-67, పోలీస్ కానిస్టేబుళ్లు-90, మహిళా...