తెలంగాణలో నిరంతర క్రీడా ఉద్యమం ‘ఖేలో తెలంగాణ’ ప్రారంభం.పోస్టర్ ఆవిష్కరించిన క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: తెలంగాణలో క్రీడా సంస్కృతిని మరింత విస్తృతం చేయడంతో పాటు, శారీరక చైతన్యాన్ని ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో “ఖేలో తెలంగాణ” పేరుతో నిరంతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారి చేతుల మీదుగా ‘ఖేలో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ​సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ...