క్యాన్సర్‌తో బాధపడుతున్న గిగ్ వర్కర్ కొండల్ రెడ్డికి ప్రభుత్వ అండ.. నిమ్స్‌లో ఉచిత వైద్యంతో పాటు రూ. 2.77 లక్షల ఆర్థిక సాయం
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: క్యాన్సర్‌తో బాధపడుతున్న గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ మెట్టుకుపల్లి కొండల్ రెడ్డికి ప్రభుత్వం అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండల్ రెడ్డికి నిమ్స్ ఆసుపత్రిలో అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ. 2,77,500 ఆర్థిక సాయాన్ని అందించారు. సంఘటన వివరాలు: తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సభ్యుడైన కొండల్ రెడ్డి దాదాపు పదేళ్లుగా ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ కాలంలో 4.76 స్టార్ రేటింగ్‌తో 7,620 ట్రిప్పులను పూర్తి చేశారు. కొంతకాలంగా కాలేయ, ప్యాంక్రియాటిక్...