దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పనిచేయాలి సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, ఎస్సీ, ఎస్టీలపై అణిచివేతను అధిగమించేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ​డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్రంలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టం (SC/ST (Prevention of Atrocities) Act, 1989) అమలుపై ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013...