బండ్లగూడ ఆర్టీవో కార్యాలయంలో విజిలెన్స్ / ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, కార్యాలయంలో జరుగుతున్న పలు అక్రమాలు, దళారుల (ఏజెంట్ల) ప్రమేయం వెలుగుచూశాయి.
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: రంగారెడ్డి రేంజ్ అధికారుల ఆధ్వర్యంలో బండ్లగూడలోని సౌత్ జోన్ ఆర్టీవో కార్యాలయంలో ఈ సర్ప్రైజ్ చెక్ రికార్డుస్థాయిలో కలకలం సృష్టించింది. తనిఖీల్లో వెలుగుచూసిన ప్రధానాంశాలు: అనుమానాస్పద లావాదేవీలు: కార్యాలయ సిబ్బంది సెల్ ఫోన్లలో కొన్ని అనుమానాస్పద యూపీఐ (UPI) లావాదేవీలను అధికారులు గుర్తించారు. ఏజెంట్ల రాజ్యం: ఆర్టీవో కార్యాలయంలో ఎలాంటి సంబంధం లేని అనధికార వ్యక్తులు / ఏజెంట్లు దరఖాస్తులతో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు తేలింది. ప్రత్యేక గుర్తుల దందా: ఏజెంట్ల ద్వారా వచ్చే దరఖాస్తులు వేగంగా క్లియర్ కావడానికి కొందరు అధికారులు (ఏఓ బి. సునిత, సీనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ ఇమ్రాన్, జూనియర్ అసిస్టెంట్ కే. బాబుజీ, ఏఓ...