భావుసింగ్ నాయక్ తండాలో వైభవంగా గణేష్ నవరాత్రులు: ఘనంగా కుంకుమ పూజలు, అన్నదానం

బంజారా బాయ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో విశేష పూజలు గణనాథుడి సన్నిధిలో లోకకళ్యాణార్థం మహిళలచే సామూహిక మహా కుంకుమార్చన తండా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలి: ఉత్సవ కమిటీ తెలంగాణ అడ్డా వీర్నపల్లి (సెప్టెంబర్ 22): భావుసింగ్ నాయక్ తండాలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 'భావుసింగ్ నాయక్ తండా బంజారా బాయ్స్ యూత్ అసోసియేషన్' గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తండాలో పలు విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. లోకకళ్యాణార్థం విఘ్నేశ్వరుడి మండపం వద్ద మహిళలతో అత్యంత భక్తిశ్రద్ధలతో మహా కుంకుమ పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తండాకు చెందిన...