ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం
ఆదిలాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా: ఆదిలాబాద్‌లోని సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రిమ్స్ ఎస్ఎన్సీయూ (SNCU) అగ్ని ప్రమాద బాధితులైన శిశువుల తల్లిదండ్రులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన తీరును, ప్రస్తుత పరిస్థితులను బాధితుల కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆమె ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడి, పలు కీలక డిమాండ్లు చేశారు. ప్రధానాంశాలు: వైద్య సిబ్బంది కొరత: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం సగం మంది స్టాఫ్, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ పూర్తి నిర్లక్ష్యానికి నిదర్శనమని కవిత...