రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద పోలీసుల కాపలా

రైతులు నీళ్లు వదలకుండా చెరువుల వద్ద పోలీసుల కాపలా మహబూబాబాద్ జిల్లా తెలంగాణ అడ్డా సెప్టెంబర్ 23 మహబూబాబాద్ జిల్లా బయ్యారం పెద్దచెరువు నుంచి తూముల ద్వారా రైతులు సాగునీటిని పారించుకోకుండా పోలీసులు చెరువు వద్ద గస్తీ కాస్తున్నారు. చెరువు నీటిని అనుమతి లేకుండా విడుదల చేయకుండా తూముల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సాగునీటి వినియోగంపై అధికారులు తీసుకున్న నిర్ణయం మేరకు పోలీసులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. దీంతో చెరువు వద్ద పోలీసుల కాపలా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.