గణేష్ నిమజ్జనాలకు పటిష్టమైన చర్యలు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు: మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడా: వినాయక నిమజ్జనం సజావుగా సాగేందుకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వపరంగా అన్ని పటిష్టమైన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో గణేశ్ నిమజ్జనానికి ముందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తదితరులతో కలిసి పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం అన్ని జిల్లాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జనాలతో పాటు, ఈనెల 25న హైదరాబాద్‌లో నిర్వహించనున్న నిమజ్జనోత్సవాలకు కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. గతంలో...